ప్రతీ మ్యాచ్‌ ముఖ్యమే

Nov 15, 2017, 01.02AM IST
VIEW IN APP
Send Push Translate
బ్యాట్స్‌మన్‌ రహానె

కోల్‌కతా: శ్రీలంక టీమ్‌ను ఏమాత్రం తేలిగ్గా తీసుకోవడం లేదని టీమిండియా బ్యాట్స్‌మన్‌ అజింక్యా రహానె అన్నాడు. లంకను వారి సొంతగడ్డపైనే 9-0తో క్లీన్‌ స్విప్‌ చేసిన భారత్‌.. టాప్‌ ర్యాంక్‌ను మరింతగా పటిష్టం చేసుకోవడంపైనే దృష్టిసారించిందని ఈడెన్‌ గార్డెన్స్‌లో మంగళవారం ప్రాక్టీస్‌ సందర్భంగా చెప్పాడు. శ్రీలంకలో ఆడిన దానికి.. ఇప్పుడు జరగబోయే సిరీస్‌కు ఎంతో తేడా ఉందని రహానె అన్నాడు. ‘టెస్టుల్లో అగ్రస్థానంలో కొనసాగాలనేదే మా ధ్యేయం. ఈ నేపథ్యంలో ప్రతి సిరీస్‌నూ నెగ్గడం ఎంతో ముఖ్యమ’ని అజింక్యా అన్నాడు. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో భారత్‌.. లంకతో సిరీస్‌లో అన్ని విభాగాలను సిద్ధం చేసుకోవాలని చూస్తోంది. ‘సఫారీ టూర్‌ ముందు ప్రతి మ్యాచ్‌, ప్రతి సిరీస్‌ ముఖ్యమే. అయితే దక్షిణాఫ్రికాకు వెళ్లినప్పుడు అప్పటి పరిస్థితుల గురించి ఆలోచిస్తాం. ప్రస్తుతం మా దృష్టంతా లంకతో సిరీస్‌పైనేన’ని రహానె చెప్పాడు. శ్రీలంకకు కూడా ఈ సిరీస్‌ ఎంతో కీలకమన్నాడు. ప్రత్యర్థుల గురించి కాకుండా జట్టు బలాబలాలపైనే దృష్టిపెట్టినట్టు చెప్పాడు.

Push Details
Title of the push
Copy
Deeplink of the push
Share url
Copy