Hero Image

రాజమండ్రి రూరల్.. వైసీపీ ఖాతాలోకేనా!

టీడీపీ కంచుకోటలో పాగా వేసేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రధానంగా రాజమండ్రి రూరల్లో టీడీపీ గోరంట్ల బుచ్చయ్య చౌదరికి తిరుగులేదని భావిస్తుండగా ఈ సారి ఈ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది వైసీపీ.

వరుసగా రెండుసార్లు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుండి గెలుపొందారు బుచ్చయ్యచౌదరి.

ఈసారి వైసీపీ తరపున చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో రామచంద్రపురం ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్న వేణుగోపాల్ను బుచ్చయ్య చౌదరిపై పోటీకి దింపడంతోనే ఆయన చెక్ పడిందని వైసీపీ నేతలు భావిస్తున్నారు.

అందరికీ అందుబాటులో ఉంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు వేణు. ఇక బుచ్చయ్య చౌదరిపై ఉన్న వ్యతిరేకతను తనవైపు తిప్పుకుంటూ ప్రచారంలో పదేపదే ఇదే అంశాలను ప్రస్తావిస్తూ ముందుకు సాగుతున్నారు. రాజమండ్రి నియోజకవర్గ ఇంఛార్జిగా వేణు వచ్చిన తర్వాత వైసీపీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. నియోజకవర్గంలో తన దృష్టికి వచ్చిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు.

ఇక ఇక్కడి నుండి జనసేన టికెట్ ఆశీంచి భంగపడ్డ కందుల దుర్గేశ్ను నిడదవోలుకు మార్చడం కూడా వైసీపీకే ప్లస్గా మారింది. కాపు నేత జక్కంపూడి రామ్మోహనరావు ప్రధాన అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చిన మంత్రి వేణు కాపు సామాజికవర్గంలో గట్టి పట్టుంది. మొత్తంగా ఒకప్పుడు తనకు కంచుకోటగా ఉన్న బుచ్చయ్య చౌదరి సీటు కదలడం ఖాయమని తెలుస్తోండగా ఓటర్లు ఎవరి వైపు ఉంటారో తేలాల్సి ఉంది.

The post రాజమండ్రి రూరల్.. వైసీపీ ఖాతాలోకేనా! appeared first on Adya News Telugu.

READ ON APP