Hero Image

మహిళా సమరం…గెలుపెవరిదో?

ఏపీలో ఎన్నికల ప్రచార పర్వం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. కీలక నేతలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయగా మహిళా నేతలు తలపడుతున్న నియోజకవర్గాల్లో గెలుపు ఎవరిని వరిస్తుందోనని ఆ నియోజకవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అధికార, విపక్ష కూటమి నుండి 5 స్థానాల్లో మహిళా నేతలు తలపడుతుండగా ఇందులో నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాగా, మరొకరు మాజీ పార్లమెంట్ సభ్యురాలు.

పెనుగొండలో వైసీపీ తరపున ఉషశ్రీ చరణ్ పోటీ చేస్తుండగా టీడీపీ నుండి సవితమ్మ బరిలో ఉన్నారు. అలాగే మంత్రులు ఉషశ్రీచరణ్, విడదల రజని, మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, రంపచోడవరం ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అలాగే అరకు పార్లమెంట్ నుండి ఇద్దరు మహిళా నాయకురాల్లే పోటీ పడుతున్నారు. అరకు ఎంపీ బరిలో వైసీపీ అభ్యర్థిగా తనూజారాణి, ఆమె ప్రత్యర్థిగా కూటమి మద్దతుతో బీజేపీ నేత కొత్తపల్లి గీత పోటీ చేస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో అరకులో వైసీపీనే విజయం వరించింది. రంపచోడవరంలో నాగులాపల్లి ధనలక్ష్మితో పోటీ పడుతున్నారు వైసీపీ అభ్యర్థి, అంగన్వాడీ మాజీ కార్యకర్త శిరీష. వీరిలో కొంతమంది తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తుండగా విజయం ఎవరిని వరిస్తుందో వేచిచూడాలి.

READ ON APP