Hero Image

అబద్దం, వంచన.. ఇవే అస్త్రాలు…..!

‘ప్రజలను నమ్మించడం… ఆ తరువాత మాట తప్పి మోసం చేయడం’.. ఇది ప్రజల మనస్సులో రాజకీయ నాయకుల పై ఉండే అభిప్రాయాలు.దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే చాలామంది రాజకీయ నాయకుల గురించి చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు ఇలాంటి విమర్శలు ఎక్కువగా చంద్రబాబు పై రికార్డ్ అవుతున్నాయి. టీడీపీ పార్టీని బలోపేతం చేసే క్రమంలో ఆయన ఇస్తున్న హామీల గురించి జరుగుతున్న చర్చలు..

అందులో భాగంగా ఆయన పై ఈ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దీనికి గతాన్ని కూడా తవ్వుతున్నారు కొంతమంది జనాలు.’ 25 ఏళ్ళ క్రితమే చంద్రబాబు కోటి ఉద్యోగాలు ఇస్తాం’ అని హామీ ఇచ్చారట. 1999 లో ఆయన చెప్పిన మాటలు ఇవి అని కొందరు అంటున్నారు. అది జరిగిందా ? ఉద్యోగాలు ఇచ్చారా ? అంటే పూర్తిగా అవునవి చెప్పలేం. కానీ ఆయన ఓ విజనరీ లీడర్ అనే భజన ఎప్పుడూ వినిపిస్తూనే ఉంది.అదే ఏడాది రేషన్ సరుకులు సైతం ఇంటికే పంపిస్తాం అని ఆయన చెప్పారట.అది కూడా పూర్తిస్థాయిలో జరగలేదు అనేది మరికొందరి వాదన.

రాష్ట్రానికి నేనే దిక్కు అనేలా … అమలు కాని హామీలు ఇచ్చి జనాలను మభ్యపెడుతున్నారు అంటూ చంద్రబాబు గురించి చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు అంటే అతిశయోక్తి లేదు. పెన్షన్ల… విషయంలో కొందరు వృద్దులు పడుతున్న ఇబ్బందులను చూసి ఇలాంటి విమర్శలు కూడా పుట్టుకొస్తున్నాయి.జగన్ మోహన్ రెడ్డి ఇలా చేసింది లేదు కదా. ఆయన ప్రభుత్వంలో ఏ రైతు, వృద్ధులు ఇబ్బందిపడిన సందర్భాలు లేవు. ఎంతో మంది ఉన్నత చదువులు కూడా చదువుతున్నారు. చాలా మంది బాగా సెటిల్ అయ్యారు. కానీ జగన్ మాత్రం ‘ల్యాండ్ టైట్లింగ్ యాక్టు పేరిట ప్రజల భూములు లాక్కుంటారంటూ’ అంటూ అబద్ధపు ప్రచారం ఎందుకు జరుగుతుంది అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు చాలా మందిలో ఉన్నాయి. అబద్దం, వంచన మాత్రమే అస్త్రాలు కాదు..జనాల్లో నమ్మకం సంపాదించడమే అసలైన అస్త్రం. ఇది జనాలకి తెలీదంటారా?

READ ON APP