Hero Image

గుడివాడ గెలిచి..ఎన్టీఆర్కు గిఫ్ట్ ఇస్తా!

గుడివాడ సీటు గెలిచి ఎన్టీఆర్కు గిఫ్ట్ ఇస్తానని చెప్పారు వైసీపీ నేత,సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని. టీడీపీ అధినేత చంద్రబాబు అంటే ఒంటి కాలుపై లేచే నాని..మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఎన్టీఆర్ అభిమానుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న నాని తెలుగుదేశం పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ చేతికి రావాలంటే ప్రస్తుతం చంద్రబాబు ఆధ్వర్యంలో ఉన్న టీడీపీని ఓడించాలని పిలుపునిచ్చారు.

పెద్ద ఎన్టీఆర్ ను దుర్మార్గుడని, తెలుగుదేశం పార్టీకి పనికిరాడని మెడ పట్టి బయటకు గెంటి పార్టీని లాక్కున్న చంద్రబాబు.. జూనియర్ ఎన్టీఆర్ కాళ్లు పట్టుకొని, టీడీపీ పగ్గాలు అప్పగించేలా ఫ్యాన్స్ బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ ను సోషల్ మీడియాలో చంద్రబాబు తిట్టించాడని మండిపడ్డారు.

తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ అభిమానులంతా కష్టపడి గెలిపిస్తే.. ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ ను తొక్కేస్తారని అన్నారు. చంద్రబాబు కొడుకు లోకేష్ ను అధికారంలో కూర్చోబెడతారని.. అందుకే ఎన్టీఆర్ అభిమానులు గుండెమీద చేయి వేసుకొని ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.చంద్రబాబు ఎన్నికలు వచ్చేసరికి అదే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓట్ల కోసం ఎగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

READ ON APP