Hero Image

IPL 2024:సీఎస్కేకు షాకిచ్చిన లక్నో

ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్కు షాకిచ్చింది లక్నో. సొంతగడ్డపై చెన్నైని వరుసగా రెండో మ్యాచ్లోనూ ఓడించి సత్తాచాటింది. చెన్నై విధించిన 211 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లలోనే చేధించింది.

భారీ లక్ష్యచేధనలో ఆదిలోనే లక్నోకు ఎదురుదెబ్బ తగిలిన ఒంటరిపోరాటం చేసి జట్టును గెలిపించాడు స్టాయినిస్.

63 బంతుల్లో 6 సిక్స్లు, 12 ఫోర్లతో 124 నాటౌట్గా నిలిచి జట్టును గెలిపించాడు. నికోలస్ పూరన్ 15 బంతుల్లో 34 పరుగులు చేశారు. ఈ విజయంతో లక్నో నాలుగో స్థానానికి చేరుకోగా, చెన్నై ఐదో స్థానంలో ఉంది.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కొల్పోయి 210 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 60 బంతుల్లో 3 సిక్స్లు,12 పోర్లతో 108 నాటౌట్గా నిలవగా శివమ్ దూబే 27 బంతుల్లో 7 సిక్స్లు,3 ఫోర్లతో 66 పరుగులు చేశారు. స్టోయినిస్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

READ ON APP