Hero Image

రవికిరణ్ దర్శకత్వంలో విజయ్

విజయ్ దేవరకొండ – దిల్ రాజు కాంబోలో మరో సినిమా రాబోతుంది. రీసెంట్గా విజయ్తో ఫ్యామిలీ స్టార్ సినిమా చేసిన దిల్ రాజు తాజాగా మరో సినిమాకు ఓకే చెప్పేశాడు. ఫ్యామిలీ స్టార్ రిజల్ట్ సంగతి పక్కన పెడితే దిల్ రాజు తన నెక్ట్స్ మూవీని విజయ్తో చేస్తుండటం విశేషం.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్కు ఇది 59వ సినిమా కాగా దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

రాజా వారు రాణి గారు సినిమాతో ప్రతిభావంతమైన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రవి కిరణ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో విజయ్ దేవరకొండ కొత్త సినిమా తెరకెక్కనుండగా మే 9న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు.

The post రవికిరణ్ దర్శకత్వంలో విజయ్ appeared first on Adya News Telugu.

READ ON APP