Hero Image

సముద్ర తీరంలో కనిపించిన దృశ్యం..

ఫ్లోరిడా: సముద్ర తీరంలో ఘోరం జరిగింది. గుర్తించిన స్థానికులు వెంటనే తీర ప్రాంత పోలీసులకు సమాచారం అందించారు. ప్లాస్టిక్ కారణంగా సముద్ర తీరాల్లో ఇటువంటి దృశ్యాలు నిత్యం చూడాల్సివస్తుందని స్థానికులు వాపోయారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆరు అడుగుల పొడవున్న షార్క్ చనిపోయింది. అయితే షార్క్ చనిపోవడానికి కారణం మాత్రం ప్లాస్టిక్ అని డాక్టర్లు తేల్చారు.

షార్క్ కడుపులో పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ అవశేషాలు ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు.

అలాగే షార్క్ మెడకు కూడా ప్లాస్టిక్ టోపీ చిక్కుకుని ఉందన్నారు. మెడకు ప్లాస్టిక్ టోపీ చిక్కుకుని పోవడం వల్ల దాని మెడకు తీవ్ర గాయాలు అయ్యాయని డాక్టర్లు తెలిపారు. అందువల్లే షార్క్ చనిపోయిందన్నారు. మనుషులు చేస్తున్న చిన్న చిన్న తప్పులే మూగజీవుల పాలిట మరణశాసనంగా మారుతున్నాయి.  

READ ON APP