Hero Image

America Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి

అమెరికాలోని అరిజోనాలోని లేక్ ప్లెసెంట్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనగా.. ఈ ఘటనలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. శనివారం రాత్రి ఈ ఇద్దరు తమ మిత్రులతో కలిసి విశ్వవిద్యాలయం నుంచి ఇంటికి కారులో వస్తుండగా ఓ గుర్తు తెలియని వాహనం వీరి కారును బలంగా ఢీ కొట్టింది. కాగా..
ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మృతులు నివేష్ ముక్కా (19), గౌతమ్ పార్సీ (19)గా గుర్తించారు. వారు అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థులుగా నమోదు చేసుకున్నారు.

READ ON APP