Hero Image

Jack fruit: పనస పండు తింటున్నారా… అయితే విషయాలు తెలుసుకోండి

Jack fruit: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మన పెద్దలు. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా పని చేసుకోగలుగుతాం. లేకపోతే అనేక ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మనం నిత్యం ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా కలుషిత ఆహారం కాకుండా స్వచ్ఛమైన ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు వైద్యులు. ప్రకృతి సేద్యమైన ఆహారాన్ని తీసుకుంటే మరింత మంచిదని చెబుతున్నారు వైద్యులు.

Jack fruit

Jackfruit Health Benefits

ప్రకృతి సేద్యమైన ఆహారం అంటే జామకాయలు, సీతాఫలాలు లేదా జాక్ ఫ్రూట్. జాక్ ఫ్రూట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీనిని తెలుగులో పనస పండు అంటారు. పనస పండు ప్రకృతిలో విపరీతంగా దొరుకుతుంది. అది కొన్ని స్థలాలలో మాత్రమే…! అయితే ఈ పనస పండు తినడం వల్ల మనకు అనేక ఉపయోగాలు ఉన్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. Jack fruit

Also Read: Sabja Seeds: సమ్మర్లో సబ్జా గింజలు తింటున్నారా..? వడదెబ్బతో పాటు గుండెపోట్లకు చెక్?

వారంలో ఒక్కసారైనా పనసపండు తినాలట. అలా తినడం వల్ల మన శరీరానికి కాల్షియం ఇతర మినరల్స్ అందుతాయట. తద్వారా మన దంతాలు అలాగే ఎముకలు బలంగా తయారవుతాయని చెబుతున్నారు వైద్యులు. ఈ పనస పండులో యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి లాంటి మినరల్స్ విపరీతంగా దొరుకుతాయి. పెటో న్యూట్రియన్స్ కూడా మనకు లభిస్తాయి. వీటి ద్వారా మన మెదడు చాలా చురుకుగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ పనస పండులో విటమిన్ ఏ మరియు విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల మనం చురుకుగా పని చేయగలుగుతామట. మెగ్నీషియం కూడా ఈ ఫ్రూట్ తింటే మనకు విపరీతంగా లభిస్తుంది.Jack fruit

అలాగే ఈ ఫ్రూట్ తింటే రోగ నిరోధక శక్తి కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే గుండె మరియు షుగర్ సమస్యలు ఉన్నవారు కూడా జాక్ ఫ్రూట్ తినవచ్చని చెబుతున్నారు వైద్యులు. ఈ ఫ్రూట్ తినడం వల్ల షుగర్ అలాగే బీపీ కంట్రోల్ లో ఉంటాయట. జీర్ణ వ్యవస్థ కూడా మెరుగవుతుందని చెబుతున్నారు వైద్యులు. తద్వారా… మలబద్ధకం అలాగే ఎసిడిటీ సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు వైద్యులు. Jack fruit

READ ON APP