Hero Image

Pink lips: గులాబి రంగు గల పెదాలను పొందాలనుకుంటున్నారా?.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Pink lips: సాధారణంగా ఆడవారికి గులాబీ రంగు పెదాలు అంటే ఎంతో ఇష్టం. అదేవిధంగా కొందరు మగవారు సైతం గులాబీ రంగు పెదాలను నాచురల్ గా తెప్పించుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక పెదాలను గులాబీ రంగులోకి మార్చుకునేందుకు కొన్ని సింపుల్ చిట్కాలు పనిచేస్తాయి. ఆ చిట్కాలతో గులాబీ రంగు గల పెదాలను మీ సొంతం చేసుకోవచ్చు.

మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Want to get Pink lips?.. But these tips are for you
  • నిమ్మకాయ:
    నిమ్మకాయ తొక్క మొలనిన్ ఉత్పత్తిని కంట్రోల్ చేస్తుంది. దీంతో పెదాలు నల్లగా మారవు. నిమ్మ తొక్కను లేదా నూనెను అప్లై చేస్తే పెదాలు మెరుస్తాయి. ఇందులోని విటమిన్ సి ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది.
  • పసుపు:
    మెలోనిన్ అత్యధికంగా ఉత్పత్తి కావడంతో హైపర్ పెగ్మెంటేషన్ సమస్య వస్తుంది. పసుపు మెలోనిన్ ఉత్పత్తిని కంట్రోల్ చేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు సైతం మేలో నిన్ను కంట్రోల్ చేస్తాయి. అనంతరం పెదాలను పింక్ కలర్ లో మారుస్తాయి.

Also Read: Jyothika: జ్యోతిక సూర్య తండ్రిని అవమానించింది.. తమిళ నటుడి షాకింగ్ కామెంట్స్.!

  • కలబంద:
    కలబంద జెల్ రాసుకుంటే పెదాలపై నలుపు తగ్గుతుంది. కలబంద పెదాలపై మెలోనిన్ ఉత్పత్తిని కంట్రోల్ చేస్తుంది. కలబందలోని గుణాలు కారణంగా ఒక్క పెదాలకే కాదు చర్మానికి కూడా ఉపయోగించవచ్చు.
  • దానిమ్మ:
    పెదాలను ఆకర్షణీయంగా మార్చడంలో దానిమ్మ కూడా సహాయపడుతుంది. దానిమ్మలో ఉండే గుణాలు కారణంగా పెదాలు పింక్ కలర్ లో మారుతాయి.
  • బీట్రూట్:
    సహజ పద్ధతిలో మీ పెదాలకి లిఫ్టిక్ కూడా వేసుకోవచ్చు. ప్రస్తుత కాలంలో బయట నుంచి తెచ్చుకున్న ప్రోడక్ట్స్ వాడడం కంటే దొరికే బీట్రూట్ ను పెదాలకి అప్లై చేయడం ద్వారా ఆరోగ్యంతో పాటు గులాబీ రంగు గల పెదాలను కూడా మీ సొంతం చేసుకోవచ్చు.

పైన చెప్పిన సింపుల్ టిప్స్ ని ఉపయోగించి గులాబీ రంగు గల అందమైన పెదవులను మీ సొంతం చేసుకోండి.(Pink lips)

READ ON APP