Hero Image

Skin Cancer: ఎక్కువ సేపు ఎండలో ఉంటే కూడా క్యాన్సర్..తస్మాత్ జాగ్రత్త !

Skin Cancer: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతంగా ఎండలు కొడుతున్న సంగతి తెలిసిందే. వేసవి మధ్యలో ఉన్నాం. మే మాసం కూడా వచ్చేసింది. ఈ తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతంగా ఎండలు కొడుతున్నాయి. దీంతో జనాలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఉదయం 7 గంటలకే ఎండ తీవ్రత విపరీతంగా ఉంటుంది. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 7:00 వరకు వడ విపరీతంగా వస్తోంది.

Skin Cancer

Exposure to sun ups skin cancer risk in athletes

ఈ కారణంగా చాలామంది రెండు తెలుగు రాష్ట్రాల్లో మృతి చెందుతున్నారు. వృద్ధాప్యంలో ఉన్నవారు ఈ ఎండ తీవ్రతను తట్టుకోలేకపోతున్నారు. ఇక చాలామంది ఆఫీసులకు వెళ్లాలంటే గజగజ వనిగిపోతున్నారు. అలాగే… ఏదైనా ఎమర్జెన్సీ పని ఉంటే తప్పితే బయటికి రావడం లేదు జనాలు. ఏదైనా పని ఉంటే సాయంత్రం ఎండ చల్లబడ్డ తర్వాత చేసుకుంటున్నారు. Skin Cancer

Also Read: Peanuts: రుచిగా ఉంటున్నాయని పల్లీలు తింటున్నారా.. అయితే డేంజర్ లో పడ్డట్టే..!

అయితే ఈ ఎండ తీవ్రత కారణంగా జనాలకు క్యాన్సర్ కూడా వస్తుందని ఇప్పుడు సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది. మరి ఇందులో ఏ మేరకు వాస్తవం ఉందో చూద్దాం. ఎండలో ఎక్కువసేపు ఉండటం కారణంగా మెలినోమా అనే క్యాన్సర్ వస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎండలో మనం ఎక్కువసేపు ఉండటం వల్ల ఈ క్యాన్సర్ వస్తుందట. అయితే దీనిని కీమోథెరపీ లేదా రేడియో తెరఫీ ద్వారా తగ్గించవచ్చట. Skin Cancer

అంతేకాకుండా బేసల్ సెల్ కార్సీ నోమా అనే క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందట. దీని ఎఫెక్ట్ ముక్కు, చెవి, పెదాలు అలాగే భుజాలు, మరియు చేతుల పైన ఉంటుందట. ఈ క్యాన్సర్ కూడా సర్జరీ లేదా రేడియో తెరఫీ ద్వారా నయం అవుతుందని సమాచారం. స్క్రమస్ అనే క్యాన్సర్ కూడా ఈ ఎండ వల్ల వస్తుందట. దీని ఎఫెక్ట్ మెడ, చెవులు, చేతులు మరియు ముఖంపై కూడా ఉంటుందట. దీన్ని శస్త్ర చికిత్స ద్వారా మనం తగ్గించుకోవచ్చట. Skin Cancer

READ ON APP