Hero Image

Hair: పొడవాటి జుట్టును కోరుకుంటున్నారా?.. అయితే మీ డైట్ లో ఈ ఆహారాలను చేర్చండి..!

Hair: సాధారణంగా ఆడవారే కాకుండా అనేక మగవారు కూడా జుట్టును ఎంతో సురక్షితంగా చూసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇందుకోసం లక్షల లక్షలు డబ్బులు సైతం పోస్తూ ఉంటారు. అనేక ట్రీట్మెంట్స్ మరియు ఇతర స్ట్రైట్నింగ్ వంటివి చేపించుకుంటూ తమ అందాన్ని పెంచుకునేందుకు చూస్తారు. కానీ అనుకోని కారణాల చేత మన జుట్టు ఊడుతూ ఉంటుంది.

మారే జీవనశైలి మరియు తినే ఆహారాలు విధంగా మన జుట్టు సంరక్షణ ఉంటుంది. కొన్ని రకాల ఆహారాలు మీ డైట్ లో చేర్చుకుంటే పొడవాటి జుట్టును మీ సొంతం చేసుకోవచ్చు. మరి ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

simple tips on glowing Hair
  • సాల్మోన్లో ఒమేగా-3 ఫ్యాటి ఆసిడ్స్ ఉంటాయి. జుట్టు పెరుగుదలకు ఇది చాలా బాగా సహాయపడుతుంది.
  • అదేవిధంగా బ్లాక్ చెర్రీస్ మరియు స్ట్రాబెరీస్ వంటి బెర్రీలు తినడం ద్వారా కూడా జుట్టుకి కావాల్సిన పోషకాలు అంది పొడవాటి జుట్టును మీ సొంతం చేసుకోవచ్చు.

Also Read: Jr. NTR: డైరెక్టర్ తో బూతులు తిట్టించుకున్న Jr.ఎన్టీఆర్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడంటే..?

  • గుడ్డులో ఉండే పొటాషియం, విటమిన్ ఏ, బీ12 కారణంగా జుట్టు సంరక్షణకు ఉపయోగపడుతుంది. గుడ్డు కేవలం జుట్టుకే కాదు శరీరానికి కావాల్సిన పోషకాలు సైతం అందిస్తుంది.
  • బాదం మరియు వాల్ నట్స్ వంటివి ప్రతిరోజు మీ డైట్ లో చేర్చుకుంటే తప్పనిసరిగా కొద్ది రోజుల్లోనే మీ జుట్టు సంరక్షణను చూస్తారు.
  • అదేవిధంగా చియా సీడ్స్ లోని జింక్, కాపర్ వంటి మినరల్స్ జుట్టు ఆరోగ్యానికి దామోదపడతాయి.

పైన చెప్పిన ఆహారాలను ప్రతిరోజు మీ డైలీ రొటీన్ లో చేర్చుకుని పొడవాటి జుట్టును మీ సొంతం చేసుకోండి.(Hair

)

READ ON APP