Hero Image

Eyes: కంటి చూపు దెబ్బతిందా?.. అయితే మెరుగుపరిచే చిట్కాలు ఇవే..!

Eyes: ప్రస్తుత కాలంలో మారిన జీవన శైలి ఆధారంగా కంటిచూపు కూడా తగ్గుతూ వస్తుంది. కంటి చూపును మెరుగుపరచుకోవాలంటే సరైన డైట్ ఫాలో అవ్వడం చాలా అవసరం. విటమిన్ ఏ అండ్ సి, జింక్, కాపర్ పోషకాలు ఉన్న ఆహారాలు తింటే కంటి చూపు మెరుగుపడుతుంది. కంటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే రెగ్యులర్ గా కంటి చెకప్ లు చేయించుకోవాలి.

కంటి చెకప్ చేయించుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన వస్తుంది.

Is the Eyes sight damaged?

కంటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే నిత్యం శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. మురికి తో నిండి ఉన్న చేతులను కళ్ళపై పెట్టి రబ్ చేస్తే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. కంటి ఇన్ఫెక్షన్స్ కూడా దరి చేరుతాయి. కంటి చూపును కాపాడుకోవాలంటే వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి. కంటి వ్యాయామాలు చేస్తే దృష్టి బాగుంటుంది. ఫోకస్ స్థాయి మరింత పెరుగుతుంది. అదేవిధంగా కంటిని సురక్షితంగా కాపాడుకోవడం కోసం నిత్యం డిహైడ్రేట్ గా ఉండడం ముఖ్యం.

Also Read: Kajal Agarwal: ఆ పని కోసం రాత్రిపూట కాజల్ అగర్వాల్ కి రూమ్ బుక్ చేసిన స్టార్ హీరో.. ఎవరంటే.?

ఎక్కువగా నీరు తాగితే పొడి కళ్ళ సమస్య తగ్గుతుంది. శారీరక వ్యాయామాలు చేయడంతో కంటి సమస్యలు దూరం అవుతాయి కూడా. వ్యాయామాలు చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. మనం చేసే పని ఏదైనా సరైన వెలుతురు ఉండేలా చూసుకోండి. ఎక్కువ వెలుతురులో చదవడంతో వివిధ సమస్యలు వస్తాయి. అందువల్ల కంటిచూపు దెబ్బతింటుంది. చీకటిలో ఫోన్ వినియోగించవద్దు. పొగతాగడం ఆరోగ్యానికి హానికరం.

పొగ తాగడంతో ఆరోగ్యం పాడవ్వడమే కాకుండా కంటి చూపు కూడా దెబ్బతింటుంది. కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే బయటకు వెళ్లే ప్రతిసారి సన్ గ్లాసెస్ ధరించడం చాలా ముఖ్యం. సన్ గ్లాసెస్ ధరించడంతో యూవీ కిరణాల నుంచి రక్షణ కలుగుతుంది. పైన చెప్పిన వాటిని కనుక మీరు రెగ్యులర్ గా పాటిస్తే మీ కంటి చూపు కి ఎటువంటి ముప్పు రాదు. అదేవిధంగా మీ ఆరోగ్యం కూడా హెల్తీగా ఉంటుంది.(Eyes)

READ ON APP