Hero Image

Preity Zinta: పంజాబ్ కెప్టెన్గా రోహిత్ శర్మ..కోట్లల్లో ఆఫర్ ఇచ్చిన ప్రీతి జింటా ?

Preity Zinta: ఐపీఎల్ 2024 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ ఇప్పటికే సగం వరకు జరిగింది. ఇప్పటివరకు సగం మ్యాచ్ల వరకు పూర్తి అయ్యాయి. మరికొన్ని మ్యాచులు జరిగితే ప్లే ఆఫ్ బెర్తులు ఖరారు అవుతాయి. ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్, కోల్కత్తా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మరియు సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు టాప్ పొజిషన్లో ఉన్నాయి.

Preity Zinta

Preity Zinta blasts fake news involving Rohit Sharma and Punjab Kings

ఈసారి ఆర్సిబి అలాగే ముంబై ఇండియన్స్ జట్లు చాలా దారుణంగా విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మకు బంపర్ ఆఫర్ వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇటీవల ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ వైదొలి గాడు. అతని తీసేసి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇచ్చింది జట్టు యాజమాన్యం. దీంతో రోహిత్ శర్మ వేరే టీంలోకి వెళ్తాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో హైదరాబాద్, లక్నో రోహిత్ శర్మ కోసం బాగా పోటీ పడుతున్నాయని సమాచారం. Preity Zinta

Also Read: Impact Player Rule: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ రద్దు..షాక్ లో ఐపీఎల్ టీమ్స్.. ?

అయితే ఇందులోకి ఇప్పుడు పంజాబ్ కింగ్స్ సహ ఓనర్ ప్రీతి జింటా కూడా వచ్చారట. రోహిత్ శర్మాను ఎంత ధర పెట్టి అయినా కొనుగోలు చేసేందుకు సిద్ధమైనట్లు ప్రీతి జింటా ప్రకటించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అంతేకాదు శిఖర్ ధావన్ ను తప్పించి రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇస్తామని ప్రీతిజింటా పేర్కొన్నట్లు కొన్ని వార్తలు వైరల్ చేశారు. అలాగే రోహిత్ శర్మకు భారీ స్థాయిలో డబ్బులు ఇచ్చేందుకు కూడా పంజాబ్ కింగ్స్ సిద్ధమైందట. Preity Zinta

అయితే ఈ వార్తలపై తాజాగా ప్రీతి జింటా స్పందించారు. రోహిత్ శర్మను కొనుగోలు చేసేందుకు మేము ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.. అందులో ఏమాత్రం నిజం లేదని తెలిపారు ప్రీతి జింటా. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ జట్టు చాలా బలంగా ఉందని… తమకు ఇప్పుడు రోహిత్ శర్మ అవసరం లేదని ఆమె వెల్లడించారు. రోహిత్ శర్మ బాగా ఆడుతున్నప్పటికీ…. మా జట్టు మాత్రం ఇప్పటికైతే బలంగా ఉందని ఆమె వెల్లడించారు. కానీ ఐపీఎల్ మెగా వేలం వరకు ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు. ఆ లోపు పంజాబ్ కింగ్స్ జట్టుకే రోహిత్ శర్మ వెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదు. Preity Zinta

READ ON APP