Hero Image

Impact Player Rule: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ రద్దు..షాక్ లో ఐపీఎల్ టీమ్స్.. ?

Impact Player Rule: ఐపీఎల్ 2024 టోర్నమెంటు చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ టోర్నమెంట్లో 35 మ్యాచ్లకు పైగా పూర్తీ అయ్యాయి. దీంతో కొన్ని జట్లు బాగా ఆడుతుంటే మరికొన్ని జట్లు విఫలమవుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన టోర్నమెంటులో… రాజస్థాన్ రాయల్స్ టాప్ పొజిషన్లో ఉంది. ఆ తర్వాత కోల్కత్తా నైట్ రైడర్స్ బరిలో ఉంది.

Impact Player Rule

Is it time for BCCI to scrap Impact Player Rule

ఇక అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మరియు హైదరాబాద్ వరుసగా ఉన్నాయి. ఈ టోర్నమెంట్లో ముంబై ఇండియన్స్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు దారుణంగా విఫలమవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ హాట్ కామెంట్స్ చేశారు. అసలు ఈ టోర్నమెంట్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తీసేయాలని డిమాండ్ చేస్తున్నాడు రోహిత్ శర్మ. Impact Player Rule

Also Read: Hardik Pandya: ప్రమాదంలో పాండ్యా కెరీర్…BCCI కొత్త కండిషన్లు… ఇక టీమిండియాలోకి రావడం కష్టమే ?

ఇంపాక్ట్ ప్లేయర్ ఉండటం వల్ల ఫాన్స్ మజా వస్తుంది కానీ ఐపీఎల్ జట్లకు ఎలాంటి ఉపయోగం లేదని తెలిపాడు. ముఖ్యంగా ఆల్రౌండర్ల కెరీర్ పై తీవ్రమైన ప్రభావం ఉంటుందని తెలిపారు. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన కారణాల శివం దుబే లాంటి డేంజర్ ప్లేయర్లు సరిగా ఆడటం లేదని తెలిపారు. వారికి బౌలింగ్ చేసే అవకాశం రావడంలేదని ఫైర్ అయ్యాడు. అలా అయితే టీమ్ ఇండియాకు కూడా తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపాడు. Impact Player Rule

అయితే రోహిత్ శర్మ సలహాలు బిసిసిఐ తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉండదని సమాచారం. అయితే ఈ ఇంపాక్ట్ రూల్ ప్రకారం… జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆడని ప్లేయర్ ను కూడా ఆడించవచ్చు. బ్యాటింగ్ చేయాలనుకునే సమయంలో బ్యాటర్ ను దించవచ్చు. అదే బౌలింగ్ అవసరమనుకున్నప్పుడు బౌలింగ్ కు కూడా దించవచ్చు. కానీ ఒక మ్యాచ్ లో ఒక్కసారి మాత్రమే ఇంపాక్ట్ ప్లేయర్ ను వాడుకోవాలి.Impact Player Rule

READ ON APP