Hero Image

ఏపీలో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు. స్వయం సహాయక (డ్వాక్రా) సంఘాల సభ్యులను ప్రభావితం చేసేలా ఎటువంటి కార్యక్రమాలూ నిర్వహించకూడదన్నారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖల్లోని అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ఎవరైనా స్వయం సహాయక సంఘాల సభ్యులతో ఏ కార్యక్రమాలు నిర్వహించినా ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుంది అన్నారు.

ఆయా సభ్యులను వ్యక్తిగతంగా, సమూహంగా రాజకీయ పార్టీల అభిప్రాయాలకు అనుకూలంగా కానీ.. వ్యతిరేకంగానీ ప్రభావితం చేసేలా సమీకరించడం, అవగాహన, సర్వే వంటి కార్యక్రమాలు నిర్వహించడం చేయకూడదని తెలిపారు. ఈ నిబంధనలు అమలయ్యేలా సెర్ప్‌ సీఈవో, మెప్మా డైరెక్టర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.

  ఎన్నికల ప్రచారంలో మహిళల గౌరవం విషయంలో కఠిన వైఖరిని అమలు­చేస్తు­న్న­ట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. మహిళలను కించపరిచేలా అభ్యంతర­కర వ్యాఖ్యలు చేసిన పార్టీల నాయకులకు తక్షణం నోటీసులివ్వడం ద్వారా మహి­ళల గౌరవం విషయంలో గట్టి వైఖరిని అమలు చేస్తున్నట్లు తెలిపింది. పార్టీ నేత­లు, ప్ర­చా­రకర్తలు ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యలను ఆశ్రయించకుండా చూసు­కోవ­డానికి పార్టీ ముఖ్యులు/అధ్యక్షులు జవాబుదారీతనం వ్యవహరించాలని కోరింది. కౌంటింగ్‌ కేంద్రాలకు పరిశీలకులను నియమించే విషయంలో ఈసీఐ మార్గదర్శకాలను పాటించాలని, అదనంగా కావాల్సిన పరిశీలకులు, ఏఆర్వోల ప్రతిపాదనలను సాధ్యమైనంత త్వరగా పంపాలని ఆదేశించారు. పోలింగ్‌ పక్రియ, కేంద్రాలు వెబ్‌కాస్టింగ్‌ ద్వారా గరిష్టస్థాయిలో కవర్‌ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

ఈ నెల 18న నోటిఫికేషన్‌ జారీతో ఆరంభమయ్యే ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు సిద్ధం కావాలని మీనా ఆదేశించారు. ఎన్నికలు శాంతియుతంగా, స్వేచ్ఛగా నిర్వహించాలన్నారు. 18 (గురువారం)న నోటిఫికేషన్‌ జారీ నుంచి రోజూ ఈసీఐకి నివేదికలు పంపాలని చెప్పారు. రోజూ క్రమం తప్పకుండా నివేదికలను పంపేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో అలసత్వం వహించరాదన్నారు. మంగళవారం సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.

ఓటరు కార్డుల పంపిణీ అంశంపై మే 4న కేంద్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తుందని.. అప్పటికి వీటి పంపిణీ పూర్తికావాలని చెప్పారు. సి-విజిల్‌ యాప్‌లో ఫిర్యాదులను సంతృప్తికర స్థాయిలో పరిష్కరిస్తున్నారంటూ జిల్లా ఎన్నికల అధికారులను సీఈవో అభినందించారు. అక్రమంగా సొత్తు తరలింపును నియంత్రించడం, విస్తృత తనిఖీల ద్వారా వాటిని స్వాధీనం చేసుకోవడంలో అనేక జిల్లాల ఎన్నికల అధికారులు ప్రగతి చూపిస్తున్నారని.. కోనసీమ, పల్నాడు, ప్రకాశం, శ్రీసత్యసాయి, పశ్చిమగోదావరి జిల్లాలు మాత్రం ఇందులో వెనుకబడ్డాయి అన్నారు. అలాగే అధికారులకు ముకేశ్‌కుమార్‌ మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు.

READ ON APP