Hero Image

'కన్నప్ప'సెట్స్ లో అడుగుపెట్టిన ప్రభాస్


మంచు విష్ణు హీరోగా ‘కన్నప్ప’ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ చాలా వరకూ న్యూజిలాండ్ లో జరిగింది. ఆ తరువాత కొంత చిత్రీకరణ హైదరాబాద్ – రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్లో జరిగింది.

తాజా షెడ్యూల్ కూడా ఈ నెల 7వ తేదీ నుంచి, రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరుగుతోంది. ప్రధానమైన పాత్రల కాంబినేషన్లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో నందీశ్వరుడిగా ప్రభాస్ కనిపించనున్నాడు. రీసెంటుగా ఆయన ఈ సినిమా సెట్లో అడుగుపెట్టాడు. మరో నాలుగు రోజుల పాటు ఆయన పోర్షన్ షూటింగ్ జరగనుంది. ఈ చిత్రంలో ఇతర కీలమైన పాత్రలలో అక్షయ్ కుమార్ .. మోహన్ లాల్ .. శివరాజ్ కుమార్ .. మోహన్ బాబు తదితరులు కనిపించనున్నారు.

The post ‘కన్నప్ప’సెట్స్ లో అడుగుపెట్టిన ప్రభాస్
first appeared on TeluguMirchi.com.

READ ON APP