Hero Image

'ద‌టీజ్ మ‌హాల‌క్ష్మీ' ఫ‌స్ట్ లుక్ ..

బాలీవుడ్ లో కంగనా నటించిన క్వీన్ చిత్రం అందరికి గుర్తుండే ఉంటుంది.. ఈ సినిమాతో కంగనా స్టార్ హీరోయిన్ అయ్యిపోయింది. లేడీ ఓరియంటెడ్ గా వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని నాలుగు భాషలలో రీమేక్ అవుతుంది. హిందీలో కంగనా రనౌత్ పోషించిన పాత్రని తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్, మలయాళంలో మంజిమా మోహన్, కన్నడలో పరుల్ యాదవ్ లు పోషిస్తున్నారు.

తెలుగులో దటీజ్ మ‌హాల‌క్ష్మీ అనే టైటిల్ ఖరారుచేస్తూ దీనికి సంబందించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. తెలుగు వ‌ర్షెన్‌ని అ చిత్ర ఫేం ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. కన్న‌డ వ‌ర్షెన్‌ని ర‌మేష్ అర‌వింద్‌ డైరెక్ట్ చేస్తుండగా బటర్ ఫ్లై అనే టైటిల్‌ ను కన్నడకు పెట్టారు. తమిళంలో పారిస్ పారిస్, మలయాళంలో జామ్ జామ్ అనే టైటిల్స్ ను ఫిక్స్ చేసారు.

ప్ర‌స్తుతం అన్ని భాష‌ల‌కి సంబంధించి షూటింగ్ ప్ర‌క్రియ పూర్తి కాగా, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలని వేగవంతం చేశారు. అతి త్వ‌ర‌లోనే చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌నుకుంటున్నారు.

READ ON APP