Hero Image

మళ్లీ మెగా ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన మెగా పవర్ స్టార్..

మెగా అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు..కొన్ని రోజులుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుండి సరికొత్త లుక్ వస్తుందని ఎదురుచూడడమే తప్ప వారి చూపులకు మాత్రం తెరపడడం లేదు. రంగస్థలం చిత్రం తర్వాత చరణ్ మార్కెట్ బాగా పెరగడమే కాదు అభిమానుల్లో అభిమానం సైతం తారాస్థాయికి చేరింది. ప్రస్తుతం ఈయన బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు.

ఈ చిత్ర షూటింగ్ గత కొన్ని నెలలుగా జరుగుతూనే ఉంది. కానీ ఈ సినిమాకు సంబందించిన ఎటువంటి ఫస్ట్ లుక్ కానీ టైటిల్ కానీ విడుదల కాకపోయేసరికి అభిమానులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు.

ముందుగా చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ వస్తుందన్నారు..అది రాలేదు..ఆ తర్వాత అజర్ బైజాన్ షెడ్యూల్ పూర్తి కాగానే రిలీజ్ చేస్తామన్నారు అది కాలేదు. ఇవాళ విజయదశమి కావడం తో ఈరోజైన వస్తుందని వెయ్యి కళ్లతో ఎదురుచూసారు. ఫస్ట్ లుక్ సరికదా, కనీసం ఆ లుక్ ఎప్పుడొస్తుందనే విషయాన్ని కూడా చెప్పలేదు. దీంతో కొంతమంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలోనే చరణ్ ను, నిర్మాత దానయ్యను కామెంట్లు చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు వినయ విధేయ రామ్ అనే టైటిల్ పెట్టారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్త అయినా నిజమో కాదో..

READ ON APP