Hero Image

ఆరోగ్యకరమైన హోళికి ఆరోగ్య చిట్కాలు!

హోళి అంటే ఇష్టం లేనిది ఎవరికి?? చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు హోళి సందడిలో తమవంతు పాత్ర పోషిస్తారు. అయితే హోళి సంబరాలలో అక్కడక్కడా అపశ్రుతులు చోటుచేసుకుంటు ఉంటాయి. హోళిని హాయిగా ఎంజాయ్ చేస్తూ.. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు అవసరం. మీ చర్మ సంరక్షణ తప్పనిసరి:  చర్మాన్ని వీలైనంత జిడ్డుగా చేయడం చాలా ముఖ్యం, తద్వారా రంగులు చర్మం మీద  వ్యాప్తి చెందడానికి లేదా అంటుకునే అవకాశం ఉండదు.

ఇందుకోసం కొబ్బరి నూనె రాసుకోవచ్చు. కొబ్బరి నూనె వల్ల మరొక లాభం ఏంటంటే చర్మం పొడిబారకుండా చేస్తుంది. అలాగే శరీరం మీద రంగులు క్లీన్ చేయడం సులువు అవుతుంది.   సేంద్రీయ రంగుల ఎంపిక:   పర్యావరణ అనుకూలంగానే కాకుండా మన చర్మానికి కూడా అనుకూలమైన రంగులతో హోలీని జరుపుకోవాలి. హానికరమైన రసాయనాలు కలిపిన రంగులను నివారించాలి. రసాయనాలు కలిపిన రంగులు ప్రకాశవంతంగా కనిపిస్తాయి అంతేకాఫు ఇవి నీటిలో చాలా తొందరగా కలిసిపోతాయి. ఈ రంగులు  చర్మం నుండి తొలగించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది.
చర్మాన్ని డ్యామేజ్ చేస్తాయి. ఇన్ఫెక్షన్లు, సైడ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. బంతి పువ్వు, గులాబీ, మందారం, చెట్ల ఆకులు, పసుపు ఇలా పువ్వుల రెక్కల నుండి రంగులు తయారుచేసుకోవచ్చు. .  హైడ్రేటెడ్ గా ఉండాలి:  హోలీ వేసవిలో వస్తుంది, హోళి సమయానికి వేసవి మొదలైపోయి ఉంటుంది. దీనివల్ల బయట ఎండలు భగ్గుమంటుంటాయి. ఈ ఎండల్లో రంగులు చల్లుకుని ఎంజాయ్ చేసినా.. మరొకవైపు ఎండ దెబ్బ మాములుగా ఉండదు.  కాబట్టి హైడ్రేటెడ్ గా ఉండటం చాలా అవసరం. నీరు, గ్లూకోజ్, జ్యూస్‌లు, శరీరాన్ని తిరిగి శక్తివంతం చేయడంలో సహాయపడతాయి.
 పైగా ఇవి చర్మం పొడిబారకుండా తేమగా ఉండేలా చేస్తాయి.   కళ్ళను తేలిగ్గా తీసుకోవద్దు:  మీరు రోజూ  కాంటాక్ట్ లెన్స్‌లను ధరించేవారు అయితే, రంగులతో ఆడుకునే ముందు వాటిని తీసివేయడం మంచిది. కళ్ళజోడు మీద రంగులు లేదా నీళ్లు పడితే ఎదుటి ప్రాంతాన్ని మసగ్గా కనిపించేలా చేస్తాయి. ఇది ఇబ్బందే అనుకోవచ్చు. అలాగని కళ్ళజోడు లేకుండా హొలీ ఆడేటప్పుడు రంగులు నేరుగా కళ్ళలోకి పడకుండా అజాగ్రత్త పడాలి. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. కాబట్టి కళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి.  స్వీట్ల దగ్గరా జాగ్రత్త:  హోలీ సమయంలో మార్కెట్‌లో కల్తీ ఖోయా, మావా అమ్ముతారు.
ఇంకా ఇలాంటి కల్తీ పదార్థాలతో స్వీట్లు తయారుచేస్తారు. ఇలాంటివే ఆఫర్స్ కింద, డిస్కౌంట్ల కింద అమ్మేస్తారు. కాబట్టి స్వీట్స్ కొనేముందు జాగ్రత్తగా ఉండాలి. .  శరీరాన్ని ఇలా కవర్ చేయాలి: హొలీ ఆడేటప్పుడు యావరేజ్ గా ఉన్న బట్టలు వేసుకోవాలి. దీనివల్ల వాటిమీద రంగులు వదలకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ కొత్త బట్టలు అయితే నాశనం అయిపోతాయి. ఫుల్ హాండ్స్ ఉన్న టాప్స్, ఫుల్ గా కాళ్లను కవర్ చేసే ప్యాంట్స్ వేసుకోవాలి. దీనీవల్ల రంగులు శరీరాన్ని పాడుచేసే అవకాశం తక్కువ.
పాత డెనిమ్ జీన్స్, పొడవాటి పైజామాలను ఎంచుకోవచ్చు.  ఇలా ఆరోగ్యకరమైన హోళిని ఎంజాయ్ చేసి, ఆరోగ్యంగా ఉండండి.                                    ◆నిశ్శబ్ద.

READ ON APP