Hero Image

వేసవిలో బాదం పప్పు తినడం మంచిదేనా? అసలు నిజాలు ఇవీ!

  బాదం ఒక డ్రై ఫ్రూట్ దీనిలో ఉండే  పోషకాలు శరీరానికి చాలా అవసరమైనవి. బాదంపప్పులో శక్తి, కొవ్వు, ప్రొటీన్, ఫైబర్, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్,  ఐరన్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. అందుకే దీన్ని డైట్‌లో భాగం చేసుకోమని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ప్రతిరోజూ ఉదయాన్నే రాత్రి నానబెట్టిన బాదం పప్పులు కనీసం నాలుగైనా తినమని చెబుతూ ఉంటారు.

 అయితే వేసవి కాలంలో బాదం పప్పు తినాలా వద్దా  కన్ఫ్యూజన్ చాలామందిలో ఉంటుంది. దీని గురించి ఆహార నిపుణులు కింది విధంగా చెబుతున్నారు. బాదంపప్పును ఏ సీజన్‌లోనైనా తినవచ్చు.  అయితే ఏ సీజన్ అయినా వాటిని నానబెట్టి తినాలి.  అయితే వేసవి కాలంలో పచ్చి బాదం పప్పుులు మాత్రం తినకూడదు. ఇవి కడుపునొప్పికి కారణం అవుతాయి. బాదం పప్పు స్వభావం సహజంగా వేడిగా ఉంటుంది. వేసవి కాలంలో బాదం పప్పులు తినడం వల్ల పిత్త దోషం సంభవించే అవకాశం ఉంటుంది.  అందుకే రాత్రంతా నానబెట్టిన బాదం పప్పును మాత్రమే తినడం అన్ని విధాలా శ్రేయస్కరం.
రాత్రి నానబెట్టిన బాదం పప్పు తినడం వల్ల జీర్ణశక్తి బలపడుతుంది.  బాదం పప్పులో ఉండే మోనోఅన్శాచురేటెడ్ ఫ్యాట్ బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో సహాయపడుతుంది. నానబెట్టిన బాదం పప్పు తింటే శోషణ సామర్థ్యం మెరుగుపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.  బాదం శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.   రోజుకు ఎవరు ఎన్ని బాదం పప్పులు తినాలంటే.. 5 నుండి 10 సంవత్సరాల పిల్లలు ప్రతి రోజూ 2 నుండి 4 బాదం పప్పులు తినవచ్చు.  జీర్ణశక్తి తక్కువగా పిల్లలు కనీసం రెండు కూడా తినలేకపోవచ్చు.
కాబట్టి పిల్లల జీర్ణశక్తి సామర్థ్యం ను బట్టి బాదం పప్పులను ఇవ్వాలి. బాదం పప్పులు తినడం కొత్తగా మొదలుపెట్టేవారు రోజూ రెండు బాదం పప్పులతో మొదలుపెట్టాలి.  అవి బాగా అలవాటు అయ్యాక వాటి పరిమాణం పెంచుకోవచ్చు. అయితే రోజుకు 8 బాదం పప్పులకు మించి ఎప్పుడూ తినకూడదు.                                                    *నిశ్శబ్ద. 

READ ON APP