Hero Image

Bengaluru: ప్రయివేట్ పార్టులోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి

స్నేహితుల మధ్య చోటు చేసుకున్న సరదా సంఘటన ఒకరి ప్రాణాలు తీసింది. వాహనాల వాటర్ సర్వీసింగ్ తర్వాత నీటిని తుడిచేందుకు ఉపయోగించే ఎయిర్‌ బ్లోయర్‌ నాజిల్‌ను స్నేహితుడి ప్రయివేట్ భాగంలోకి చొప్పించడంతో యువకుడు మృతి చెందాడు. బెంగళూరులో గతవారం జరిగిన ఈ విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బెంగళూరులోని సంపెగహళ్లి ప్రాంతానికి చెందిన యోగేశ్‌ (24), స్థానికంగా వాషింగ్‌ సెంటర్‌లో పని చేస్తున్న తన స్నేహితుడు మురళి (28) దగ్గరికి బైక్‌తో వెళ్లాడు. అక్కడ తన ద్విచక్రవాహనం సర్వీసింగ్‌ చేయించిన తర్వాత ఇద్దరూ కాసేపు ఎయిర్ బ్లోయింగ్ మిషన్‌తో సరదాగా ఆడుకున్నారు. తొలుత మిషన్‌తో గాలిని మురళి ముఖంపై యోగేశ్ కొట్టగా.. అతడు తప్పించుకున్నాడు. అనంతరం మురళి దానిని పట్టుకుని బ్లోయర్‌ నాజిల్‌ను యోగేశ్ మర్మాంగంలోకి చొప్పించి, ఆన్‌ చేశాడు. దీంతో అతడి పొట్ట ఉబ్బిపోయి..
తీవ్ర అస్వస్థతకు గురైన మురళి సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే అతడు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యులు గాలి ఒత్తిడి వల్ల అవయవం లోపలి భాగాలు దెబ్బతిన్నట్టు గుర్తించారు. తక్షణమే శస్త్రచికిత్స అవసరమని సూచించారు. వైద్యులు సర్జరీ చేసినప్పటికీ.. అతడి పరిస్థితి విషమించి గురువారం చనిపోయాడు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మార్చి 25న ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలిపారు. విజయపురకు చెందిన యోగేశ్.. డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తూ తానిసంద్రలోని తన అమ్మమ్మ వద్ద ఉంటున్నాడాని పేర్కొన్నారు.
పోస్ట్‌మార్టం నివేదిక కోసం వేచిచూస్తున్నట్టు పోలీసులు చెప్పారు.

READ ON APP