Hero Image

AP Inter Marks Memo 2024 : ఏపీ ఇంటర్ షార్ట్ మెమోలు వచ్చేశాయ్.. ఒక్క క్లిక్తో డౌన్లోడ్ లింక్ ఇదే

AP Inter Marks Memo 2024: ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు (AP Inter Results 2024) ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఒకేసారి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ తో పాటు ఒకేషనల్ కోర్సుల ఫలితాలను కూడా ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. కేవలం 22 రోజుల వ్యవధిలోనే స్పాట్ పూర్తి చేయటంతో పాటు ఫలితాలను కూడా విడుదల చేశారు. మరోవైపు సప్లిమెంటరీ పరీక్షల తేదీలను కూడా ప్రకటించింది.
ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్ధులు, ఇంప్రూవ్‌మెంట్‌ రాయాలనుకునే విద్యార్ధులు ఏప్రిల్ 18వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించాలని ఇంటర్‌ బోర్డు అధికారులు వెల్లడించారు. సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపులకు ఏప్రిల్ 24వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఇదిలా ఉంటే… షార్ట్ మెమోలకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది ఇంటర్ బోర్డు. విద్యార్థుల షార్ట్ మెమోలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. వీటిని విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
AP Inter Marks Memo 2024 డౌన్‌లోడ్‌ డైరెక్ట్ లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి. అయితే.. ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను తాజాగా ఏపీ ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. మే 24వ తేదీ నుంచి జూన్‌ 1వ తేదీ వరకు ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండ్‌ ఇయర్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. రోజుకు రెండు సెషన్ల చొప్పున సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేసింది. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌..
మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండ్‌ సెషన్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏపీ ఇంటర్ షార్ట్‌ మెమోను ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి :
  • ఏపీ ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు మొదట https://bieap.apcfss.in/ వెబ్‌సైట్ లోకి వెళ్లాలి.
  • హోంపేజీలో Memorandum of Marks అనే ఆప్షన్ కనిపిస్తుంది.
  • ఇక్కడ ఇంటర్ ఫస్ట్, సెకండియర్, ఒకేషనల్ కోర్సుల ఆప్షన్లు కనిపిస్తాయి. వాటి పక్కనే వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది.
దానిపై క్లిక్ చేయాలి.
  • వ్యూ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత… మీ రోల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేయాలి.
  • డౌన్లోడ్ మార్క్స్ మెమో అనే ఆప్షన్ పై క్లిక్‌ చేస్తే.. మీ మెమో డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్‌ చేసి మార్కుల కాపీని పొందొచ్చు.
  • ఏపీ మోడల్‌ స్కూల్ ప్రవేశాలకు హాల్ టికెట్లు విడుదలఆంధ్రప్రదేశ్‌ మోడల్‌ స్కూల్స్ ప్రవేశ పరీక్ష హాల్‌ టికెట్లు పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది.
    2024-25 విద్యా సంవత్సరంకు గానూ రాష్ట్రంలో ఉన్న 164 ఏపీ ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్)ల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి ఏప్రిల్ 21వ తేదీన అర్హత పరీక్ష నిర్వహిస్తున్నామని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ తెలిపారు.

    READ ON APP