Hero Image

TGCET Result 2024 : తెలంగాణ గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ లింక్ ఇదే

TGCET Result 2024 : తెలంగాణ గురుకులాల్లో (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌, టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎల్‌, ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌, టీఆర్‌ఈఐఎస్‌) 5వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించి రాత పరీక్ష ఫలితాలను (ఫేజ్‌-1) తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ తాజాగా విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 11వ తేదీన పరీక్ష జరిగింది.
ఎంపికైన విద్యార్థులకు ఇంగ్లిష్‌ మీడియం విద్యతో పాటు, ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. విద్యార్థులు ఫలితాలను https://tgcet.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు. TGCET Result 2024 డైరెక్ట్‌ లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి. తెలంగాణ గురుకులాల్లో (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌, టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎల్‌, ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌, టీఆర్‌ఈఐఎస్‌) 2024-25 విద్యాసంవత్సరానికి గాను 5వ తరగతి (ఇంగ్లిష్‌ మీడియం)లో ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 2023 డిసెంబర్‌ నెలలో నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
2023 డిసెంబర్‌ 18 నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఆన్‌లైన్‌ విధానంలో 2024 జనవరి 6వ తేదీ వరకు అప్లయ్‌ చేసుకునే అవకాశం కల్పించారు.

READ ON APP