Hero Image

APMS 6th Hall Tickets 2024 : ఏపీ మోడల్ స్కూల్ 6వ తరగతి ప్రవేశ పరీక్ష.. హాల్టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే

AP Model Schools 6th Hall Tickets 2024 : ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులకు హాల్‌టికెట్లు (APMS 6th Hall Tickets) విడుదల చేశారు. 2024-25 విద్యా సంవత్సరంకు గానూ రాష్ట్రంలో ఉన్న 164 ఏపీ ఆదర్శ పాఠశాల (AP Model Schools)ల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి ఏప్రిల్ 21 న అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ తెలిపారు.
ఈ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలు అన్ని మండలాల్లోని ఆదర్శ పాఠశాలల్లో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్ టికెట్లు https://cse.ap.gov.in/ లేదా https://apms.apcfss.in/StudentLogin.do వెబ్‌సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 6వ తరగతిలో అడ్మిషన్ల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష ఐదో తరగతి స్థాయిలో ఉంటుందని.. తెలుగు/ ఇంగ్లీషు మీడియంలలో రాయవచ్చని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు.
AP POLYCET Hall Ticket 2024 : ఏపీ పాలీసెట్‌ 2024 హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదేAP POLYCET 2024 : ఆంధ్రప్రదేశ్‌ పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఏపీ పాలీసెట్‌ 2024 హాల్‌ టిక్కెట్లు విడుదలయ్యాయి. ఏపీ పాలీసెట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇక.. ఏప్రిల్ 27వ తేదీన పాలీసెట్‌ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షల కోసం అవసరమైన స్టడీ మెటీరియల్‌ కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ - 2024కు ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరించారు. ఈ పాలీసెట్‌ ప్రవేశ పరీక్ష ద్వారా… ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో వివిధ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.

READ ON APP