Hero Image

Ram Navami 2024 - School Holidays : విద్యార్థులకు గుడ్న్యూస్.. ఈరోజే శ్రీరామ నవమి.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు!

Ram Navami 2024 - School Holidays : శ్రీరాముడి జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం శ్రీరామనవమి (Sri Ram Navami)కి సెలవు ప్రకటించింది. అధికారిక క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 17వ తేదీ బుధవారం సెలవు (Holiday) దినంగా ప్రభుత్వం ప్రకటించింది. శ్రీరామనవమి సందర్భంగా.. తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.
ఈ నేపథ్యంలో ఆరోజు రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలే కాకుండా విద్యాసంస్థలు సెలవులో ఉండనున్నాయి. ఈ సెలవుదినాన్ని సాధారణ సెలవుదినంగా ప్రభుత్వం పేర్కొంది. కాగా.. హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభాయాత్రను పురస్కరించుకుని నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు. ప్రతి సంవత్సరం చైత్ర శుక్ల పక్షం తొమ్మిదవ రోజున శ్రీరామనవమి జరుపుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 17న శ్రీరామనవమి జరుపుకోనున్నారు. హిందూ విశ్వాసాల ప్రకారం శ్రీరాముడు ఈ పవిత్రమైన రోజున జన్మించాడు.
కాబట్టి, దేశం మొత్తం శ్రీరామనవమిని అత్యంత వైభవంగా జరుపుకుంటుంది. దాదాపు 500 ఏళ్ల తర్వాత శ్రీరాముడు తన జన్మస్థలానికి తిరిగి రావడంతో అయోధ్యలో రాబోయే పండుగకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 50 లక్షల మంది భక్తులు అయోధ్యకు చేరుకుని శ్రీరామ జన్మభూమి మందిరంలో శ్రీరాముడి దర్శనం పొందుతారని అంచనా. దీంతో అయోధ్య ట్రస్టు నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.అలాగే.. ఈ నెల‌లో నాలుగు ఆదివారాలు ( ఏప్రిల్ 7, 14, 21, 28) ఉన్నాయి. ఆదివారాలలో సాధారణంగా సూల్స్‌, కాలేజీలు, ఆఫీస్‌లకు హాలిడేస్ ఉన్న విష‌యం తెలిసిందే.
అలాగే.. ఏప్రిల్ 13వ తేదీ రెండో శ‌నివారం.. ఏప్రిల్ 27వ తేదీ నాల్గో శ‌నివారం చాలా స్కూళ్లు, ఆఫీస్‌ల‌కు సెల‌వులు ఉన్న విష‌యం తెలిసిందే. స్కూల్‌ విద్యార్థుల‌కు మ‌రో గుడ్‌న్యూస్‌:2024 ఏప్రిల్ 24వ తేదీ నుంచి స్కూళ్లకు వేస‌వి సెల‌వులు ప్రారంభం కానున్నాయి. దాదాపు స్కూల్స్‌కి 50 రోజులు పాటు ఈ సారి వేస‌వి సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది. అలాగే అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ జూనియర్ కళాశాలల‌కు ఇంటర్మీడియట్ వేసవి సెలవులను మార్చి 31వ తేదీ నుంచి మే 31, 2024 ఇచ్చిన విష‌యం తెలిసిందే.

READ ON APP