Hero Image

నాకు గర్వంగా ఉంది.. ట్రోలింగ్ మీద చాందనీ చౌదరి వివరణ

చాందినీ చౌదరి తెలుగమ్మాయిగా ఇండస్ట్రీలో పదేళ్లకు పైగా కొనసాగుతూనే ఉంది. మంచి పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించింది. ఆమె ఓ సినిమాలో కనిపిస్తుందంటే.. ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందనిపించుకునే స్థాయికి ఆమె చేరింది. రీసెంట్‌గా ఆమె నటించిన గామీ మంచి విజయాన్ని సాధించింది. థియేటర్లో, ఓటీటీలో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అంతకు ముందు కలర్ ఫోటో మూవీతో అందరినీ ఏడిపించేసింది. ఇక యేవమ్, మ్యూజిక్ షాపు మూర్తి అంటూ ప్రయోగాలు చేస్తోంది. మ్యూజిక్ షాపు మూర్తి ప్రమోషన్స్‌లో భాగంగా చాందినీ చౌదరి మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఏ ఐపీఎల్ టీంను సపోర్ట్ చేస్తారు అని అడిగిన ప్రశ్నకు, ఆ అడిగిన వ్యక్తికి కౌంటర్ ఇచ్చే ఉద్దేశంలో కాస్త వ్యంగ్యంగా సమాధానం ఇచ్చింది చాందినీ చౌదరి. తాను ఎక్కువగా క్రికెట్ చూడనని చెప్పింది చాందినీ చౌదరి. అయితే తనది ఏపీ అని, తమ రాష్ట్రానికి టీం లేదు కదా?..
ఉంటే దానికే సపోర్ట్ చేసే దాన్ని అంటూ చాందినీ చౌదరి చెప్పింది.ఇక ఈ మాటలే ఇప్పుడు నెట్టింట్లో ట్రోలింగ్‌కు దారి తీసింది. ఉండేది ఇక్కడ.. బతికేది ఇక్కడ.. సినిమాలు తీసుకునేది, చేసుకునేది ఇక్కడ కానీ.. మన టీంని మాత్రం సపోర్ట్ చేయడం లేదు అంటూ ఇలా చాందినీ మీద ట్రోలింగ్ చేస్తున్నారు. ఐపీఎల్ టీం మాత్రమే కాదు క్యాపిటల్ కూడా లేదంటూ చాందినీ వ్యాఖ్యలను వక్రీకరిస్తూ పొలిటికల్ ట్రోలింగ్ కూడా చేస్తున్నారు.
వీటిపై చాందినీ స్పందించింది.
నేను మనకి కూడా ఓ టీం ఉంటే బాగుంటుందనే ఉద్దేశం అలా అన్నాను..కానీ ట్రెండింగ్ కోసం కొంత మంది ఇలా కట్ చేసి ఎడిట్ చేసి వేసుకుంటున్నారు.. వాళ్లకి నచ్చినట్టుగా ఆ వీడియోని మార్చుకుంటున్నారు.. నేను మన రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన దాన్ని.. మన రెండు తెలుగు రాష్ట్రాలంటే నాకు ఎంతో గర్వంగా ఉంటుంది.. మన ఎస్ఆర్‌హెచ్ టీంకు ఆల్ ది బెస్ట్ అని చాందినీ క్లారిటీ ఇస్తూ వివాదానికి పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది.

READ ON APP