Hero Image

సురేఖా వాణి బర్త్ డే.. వీడియోతో విషెస్ చెప్పిన సుప్రిత

సురేఖా వాణి, సుప్రితలు నెట్టింట్లో చేసే హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక సుప్రిత తన తల్లికి బర్త్ డే విషెస్ చెబుతూ వదిలిన వీడియో, పోస్టులో చూపించిన ప్రేమ ఇప్పుడు వైరల్ అవుతోంది. నువ్వే నాకు సర్వస్వం అంటూ అమ్మ మీద ప్రేమను కురిపిస్తూ సుప్రిత వేసిన పోస్ట్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఈ వీడియోలో సురేఖా వాణి, సుప్రితలు ఆనందంగా గడిపిన క్షణాలకు సంబంధించిన విజువల్స్ ఉన్నాయి.నువ్వే నా సపోర్ట్ సిస్టమ్..
నువ్వే నా బ్యాక్ బోన్ అంటూ ఇలా తన తల్లిపై సుప్రిత ప్రేమను కురిపించింది. ప్రస్తుతం అందరూ కూడా మానసిక సమస్యలతో సతమతం అవుతున్నారని, కానీ తనకు మాత్రం తన తల్లి వాటిని నయం చేసే ఓ మోటివేషనల్ స్పీకర్, ఇన్‌స్పిరేషనల్ పర్సన్‌గా ఉంటుందని చెప్పుకొచ్చింది. నాకోసం చేసిన ప్రతీ ఒక్క పనికి థాంక్స్ అమ్మా అంటూ ఇలా సురేఖా వాణి మీద సుప్రిత పోస్ట్ వేసింది.
ఇక సురేఖా వాణి బర్త్ డే సందర్భంగా ఆమె తోటీ నటీమణులు విషెస్ చెప్పారు. సీనియర్ నటి రజిత, సనా వంటి వారంతా తమ ఫ్రెండ్ బర్త్ డేకు స్పందిస్తూ విషెస్ తెలిపారు.
అమర్ దీప్ సైతం అక్కా అంటూ ప్రేమను కురిపించాడు. అమర్ దీప్, సుప్రిత కలిసి ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక సురేఖా వాణి బర్త్ డే సందర్భంగా నెటిజన్లు మాత్రం పెద్ద ఎత్తున స్పందిస్తూ విషెస్ తెలుపుతున్నారు.

READ ON APP