Hero Image

గ్లామర్ షో కాకుండా నటించడం ఎప్పుడు స్టార్ట్ చేస్తావ్?.. నెటిజన్ ట్రోలింగ్పై మాళవిక కౌంటర్

మాళవిక మోహనన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తంగలాన్, రాజా సాబ్ సినిమాలతో రానుంది. ఆల్రెడీ తంగలాన్ షూటింగ్ పూర్తయింది. కానీ విడుదల విషయంలో క్లారిటీ రావడం లేదు. రాజా సాబ్ షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో ఎవ్వరికీ తెలియదు. అలా మాళవిక ఆగమనం ఆలస్యం అవుతూనే వస్తోంది. తెలుగు తెరకు మాళవిక పరిచయం కాకపోయినా.. ఆమె అందాలు మాత్రం ఇన్ స్టాగ్రాం ద్వారా తెలుగు ఆడియెన్స్‌కు బాగానే పరిచయం అయ్యాయి.
ఆమె అందాల ప్రదర్శన ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే మారుతుంటుంది.మాళవిక తాజాగా తన ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేసింది. ట్విట్టర్‌లో మాళవిక పెట్టిన క్యూ అండ్ ఏ సెషన్ అదిరిపోయింది. ఇక ఒక్కో నెటిజన్ ఒక్కోలా ప్రశ్నలు సంధించాడు. కొందరు పాజిటివ్ ప్రశ్నలు వేస్తే.. ఇంకొందరు ట్రోలింగ్ చేసేలా ప్రశ్నలు వేశారు. నెగెటివ్ ప్రశ్నలకు సైతం మాళవిక రిప్లై ఇవ్వడమే ఇక్కడ విశేషం. అయితే మాళవిక తంగలాన్, గిల్లి మూవీస్ మీద స్పందించింది.
తంగలాన్ విడుదల కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది.
గిల్లీ ఐకానిక్ మూవీ అని చెప్పుకొచ్చింది. చిన్నప్పుడు హృతిక్ రోషన్ మీద క్రష్ ఉండేదని తెలిపింది. పెళ్లి ఎప్పుడు అని ఓ నెటిజన్ అడిగితే.. నా పెళ్లి గురించి మీ తొందర ఏంటి? అని కౌంటర్ వేసింది. ఇక ఓ నెటిజన్ అయితే.. ఎప్పుడూ ఈ ఎక్స్ పోజింగ్ ఏంటి? ఇలాంటి ఫోటోలనే ఎందుకు షేర్ చేస్తావ్ అని అడిగితే.. సింపుల్.. నాకు ఇష్టం అంతే అని చెప్పుకొచ్చింది.
ఎప్పుడూ ఈ గ్లామర్ ఫోటోలే కాకుండా ఇక యాక్టింగ్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేస్తావ్ అని ఓ నెటిజన్ అడిగేశాడు.
దానికి మాళవిక మోహనన్ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. నేను ఎప్పుడూ చేయను.. నీకేమైనా ప్రాబ్లమా? అని ఇచ్చి పడేసింది. ఇలా ప్రతీ ఒక్కరి ప్రశ్నకు మాళవిక తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది.

READ ON APP