Hero Image

కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా.. ఇలా చేయండి..

తన కోపమే తనకి శత్రువు అంటారు. ఈ కోపంలో వారేం చేస్తారో వారికే తెలియదు. కోపంలో ఏవేవో చేసేసి తర్వాత బాధపడతారు. కోపం వల్ల వచ్చే నష్టాన్ని వారు కూడా భరిస్తారు. అలాంటప్పుడు కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక బాధపడతారు. అలా కాకుండా, కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
బ్రీథింగ్ వర్కౌట్స్..

కోపంగా అనిపించినప్పుడు ఆ పరిస్థితి నుండి దూరంగా ఉండండి. మనసుని కంట్రోల్ చేసుకోవడానికి బ్రీథింగ్ వర్కౌట్స్ చేయండి. దీని వల్ల చాలా వరకూ కోపం తగ్గుతుంది.


వేరే విషయాల గురించి..

కోపాన్ని కంట్రోల్ చేయడానికి వేరే విషయాల గురించి ఆలోచించండి. మీ మనసు, శరీరానికి రెస్ట్‌ని ఇవ్వండి. నిద్రపోవడం, మ్యూజిక్ వినడం వంటి వాటి గురించి ఆలోచించండి. కోపం రావడానికి కారణం, పరిస్థితులని మర్చిపోయి సమస్యని పరిష్కరించేందుకు ప్రయత్నించండి.

కోపం ప్రతీదానికి పరిష్కారం కాదని, అది పరిస్థితిని దిగజార్చుతుందని గుర్తుంచుకోండి.


ఆలోచించి మాట్లాడడం..

కోపంలో మాట్లాడే విషయాలు తర్వాత పెద్ద నష్టానికి దారితీస్తాయి. కాబట్టి, ఏదైనా చేసేముందు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కోపంలో తప్పలు చేయడం, మాట్లాడడం మానుకోండి. కోపం తర్వాత వచ్చే సమస్యల గురించి ఆలోచిస్తే ముందే కోప్పడకుండా ఉంటారు.


బాధని తెలియజేయడం..

సరిగ్గా ఆలోచించాక మీ బాధ గురించి తెలియజేయండి. దీని వల్ల ఎవరికీ ఏం నష్టం జరగకుండా ఉంటుంది. కాబట్టి, ముందే మీ బాధని తెలియజేయండి. ​Also Read : ఆడపిల్లలు తండ్రిని ఎందుకు ఎక్కువగా ఇష్టపడతారంటే..


తిట్టడం..

కోపంలో చాలా మంది ఇతతరులను తిట్టడం, బూతులు మాట్లాడడం చేస్తుంటారు. అలా చేయడం వల్ల ఆ మాటలు తర్వాత చాలా బాధపెడతాయి. అలా కాకుండా మీకు ఏం అనిపిస్తుందో అది చెప్పే ప్రయత్నం చేయండి.

దాని గురించి మీ వివరించి సైలెంట్‌గా ఉండండి.


నవ్వడం..

బాధ, చిరాకు కలిగించే విషయాలు మనకి కోపాన్ని తెప్పిస్తాయి. కాబట్టి, వాటిని హాస్యంతో దూరం చేయండి. నవ్వండి, నవ్వుతూ ఉండండి. అలాంటి వీడియోలు చూడండి. ఆల్‌గుడ్, టేక్ ఇట్ ఈజీ వంటి వర్డ్స్‌ని ఒకటికి రెండు సార్లు గట్టిగా చెప్పండి. లేదా సైలెంట్‌గా సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేయండి. దీని వల్ల చాలా వరకూ మనసు రిలాక్స్ అవుతుంది. ​Also Read : పెళ్ళి చేసుకున్నవారు ఈ తప్పులు చేస్తే అస్సలు మంచిది కాదట


నిపుణుల సలహా..

ఇన్నిచేసినా, ఏం ప్రయత్నించినా మన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేం. అలాంటప్పుడు కచ్చితంగా ఎక్స్‌పర్ట్స్ సలహా తీసుకోండి. వారు చెప్పినవి ఫాలో అవ్వండి. ​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​Read More : Relationship News and Telugu News

READ ON APP