Hero Image

అవిసెల్ని ఇలా తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు చాలా లాభాలున్నాయ్..

అవిసెల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, జింక్, ఐరన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ తీసుకుంటే అనేక పోషకాలు శరీరానికి అందుతాయి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల అవాంఛిత కొలెస్ట్రాల్ కరుగుతుంది.
చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. బరువు తగ్గాలనుకునేవారికి అవిసెలు చాలా మంచివి. వీటిని ఎలా తీసుకుంటే ఏమేం ప్రయోజనాలో తెలుసుకోండి.
అవిసెలతో లాభాలు..

అవిసెల్లోని గొప్ప గుణాల కారణంగా వీటిని రెగ్యులర్‌గా తీసుకుంటే మలబద్ధకం దూరమవుతుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది. దీంతో పాటు బరువు తగ్గడాని హెల్ప్ అవుతుంది. ఇందులోని గుణాలు స్కిన్, హెయిర్‌కి చాలా మంచిది.


అవిసెలతో అందం..​ ​
ఫ్లాక్స్ సీడ్ స్మూతీ..

చాలా మందికి ఉదయాన్నే హడావిడిగా ఉంటుంది. బిజీగా ఉన్నప్పుడు బ్రేక్‌ఫాస్ట్ మానేస్తారు. అయితే, దాని బదులు మీరు స్మూతీస్‌ని ట్రై చేయొచ్చు. ఇందుకోసం మీకు నచ్చిన పండ్లని తీసుకుని అందులో పాలు కలిపి కొద్ది అవిసెలని వేసి తీసుకోవడం. ఇందులో ఫైబర్, ప్రోటీన్స్ ఉంటాయి. కాబట్టి, శరీరానికి చాలా లాభాలు ఉన్నాయి. ​Also Read : నిమ్మరసాన్ని ఇలా తీసుకుంటే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయట..


అవిసెల నీరు..

ఈ నీటిని రాత్రి పడుకునే ముందు తీసుకోవచ్చు. ఇందుకోసం పడుకునే ముందు ఓ గ్లాసు నీటిలో ఓ టీస్పూన్ అవిసెలని వేసి ఉదయాన్నే ఈ నీటిని వడకట్టి తాగొచ్చు. ​Also Read : మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ మిస్ చేస్తున్నారా.. జాగ్రత్త..


జీర్ణక్రియ కోసం..

జీర్ణక్రియని మెరుగుపరచడంలో పెరుగు ముందుంటుంది.

ఇది మంచి ప్రోబయోటిక్ ఫుడ్. దీనిని తీసుకుంటే మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇక ఇందులోని గుణాలను పెంచాలంటే పెరుగులో అవిసెల్ని కలిపి తినాలి. దీనిని స్నాక్‌లా తినొచ్చు. ఈ స్నాక్‌లో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డీలు ఉన్నాయి.


అవిసెగింజల టీ..

ఈ టీని సాధారణ టీలానే చేస్తారు. ఇందుకోసం ఓ గిన్నెలో రెండు గ్లాసు నీటిని తీసుకుని మరిగించండి. అందులో చిటికెడు దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ వేసి ఓ గ్లాసు అయ్యేవరకూ దానిని మరిగించండి.

ఇప్పుడు దానిని వడకట్టి అందులో నిమ్మరసం, తేనె వేసి బాగా మిక్స్ చేసి తాగాలి.​

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Read More : Health News and Telugu News

READ ON APP