Hero Image

Chaitra Pournami 2024 ఛైత్ర పౌర్ణమి విశిష్టతలేంటి.. నిండు పున్నమి వేళ పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందట..!

Chaitra Pournami 2024 హిందూ పురాణాల ప్రకారం, పౌర్ణమి తిథి అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ పర్వదినాన లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. తెలుగు పంచాంగం ప్రకారం, 12 పౌర్ణమి తిథులు వచ్చినప్పటికీ.. ఛైత్ర మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. తెలుగు క్యాలెండర్ ప్రకారం, ఛైత్ర పౌర్ణమిని తొలి పౌర్ణమిగా పరిగణిస్తారు.
ఇదే రోజున హనుమాన్ జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 23వ తేదీన మంగళవారం ఛైత్ర పౌర్ణమి వచ్చింది. ఈ సందర్భంగా ఛైత్ర పౌర్ణమి వేళ ఏయే పూజలు చేయాలి.. ఏయే సమయాల్లో చేయాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
రాత్రి వేళలో లక్ష్మీపూజ చేయాలి..

ఈసారి ఛైత్ర పౌర్ణమి వేళ హనుమాన్ జయంతి కూడా వచ్చింది. కాబట్టి ఈరోజున ఆంజనేయుడిని, శ్రీ విష్ణువును సత్యనారాయణ రూపంలో పూజించాలి. ఈ పవిత్రమైన రోజున సత్యనారాయణ స్వామి కథలను వినాలి.

ఉపవాసం కూడా పాటించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కూడా లభిస్తాయి. రాత్రి పూట లక్ష్మీదేవిని పూజించాలి.

Hanuman Jayanti 2024 హనుమాన్ జయంతి వేళ మీ రాశి ప్రకారం, ఈ మంత్రాలను పఠిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయట..!
హనుమాన్ పూజ..

ఛైత్ర పౌర్ణమి వేళ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:58 గంటల మధ్య హనుమంతుడికి పూజ చేయాలి. చంద్రోదయ సమయం ఉదయం 6:25 గంటలకు ఉంటుంది. రాత్రి 11:27 గంటల నుంచి రాత్రి 12:47 గంటల మధ్య లక్ష్మీపూజ చేస్తే మంచి ఫలితాలొస్తాయి.


జీవితంలో సంతోషం కోసం..

పురాణాల ప్రకారం, వానర రాజు కేసరి, తల్లి అంజనీకి ఛైత్ర పౌర్ణమి వేళ హనుమంతుడు జన్మించాడు. ఈ పర్వదినాన హనుమంతుడిని స్మరించుకుంటూ, సుందరకాండ పారాయణం చేయాలి. ఇలా చేయడం వల్ల ఆంజనేయుడు ఆపద నుంచి రక్షిస్తాడని, తమ జీవితంలో సంతోషం దక్కుతుందని నమ్ముతారు.


ఛైత్ర పౌర్ణమి రోజే..

పురాణాల ప్రకారం, ఛైత్ర పౌర్ణమి వేళ కన్నయ్య రాస్ ఉత్సవాన్ని నిర్వహించారు.

ఈ ఉత్సవంలో వేలాది మంది గోపికలు పాల్గొనగా.. వేణు మాధవుడు ఆనందంగా పాల్గొని నాట్యమాడారు. ఈ పవిత్రమైన రోజున తీర్థయాత్రలకు, ఆలయాలకు వెళ్లడం, నదీస్నానం చేయడం, దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందొచ్చని పండితులు చెబుతారు. ఇదే రోజున ఉపవాసం ఉండి చంద్రుడికి పూజలు చేయడం వల్ల చంద్రుడు ప్రసన్నమవుతాడని నమ్ముతారు.గమనిక : ఇక్కడ అందించిన భక్తి సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి.
ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.Read Latest Religion News and Telugu News

READ ON APP