Hero Image

Hanuman Chalisa హనుమాన్ చాలీసాలోని ఈ రహస్యాలేంటో తెలుసా...

Hanuman Chalisa హిందూ పురాణాల ప్రకారం, అత్యంత ధైర్యం, ఎక్కువ బలం ఉన్న దేవుళ్లలో హనుమంతుడు ఒకరు. శ్రీరామునికి పరమ భక్తుడు వాయుపుత్రుడు. ఆంజనేయుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తను ఆజన్మ బ్రహ్మచారి. చిన్నతనంలో ప్రకృతి ప్రతికూల సంఘటన కారణంగా వాయుపుత్రుడు తన చిన్నతనంలోనే సూర్యుడిని చూసి మామిడి పండు అనుకుని తినబోయాడు.
అప్పుడు ఇంద్రదేవుడు తన వజ్రాయుధంతో కొట్టడం వల్ల తన మూతి వికృతంగా మారిపోయినట్లు పురాణాల్లో పేర్కొనబడింది. హిందూ గ్రంథాల ప్రకారం, ఎనిమిది మంది చిరంజీవులు ఉన్నారు. చిరంజీవి అంటే మరణం లేని వారు. అందులో హనుమంతుడు ఒకరు. కలియుగం అంతమయ్యే వరకు శ్రీరాముని పేరు జపిస్తూ భూమిపై నివాసం ఉంటాడని పండితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. హనుమంతుడిని ప్రసన్నం చేసుకునేందుకు హనుమాన్ చాలీసా పఠించాలని పండితులు చెబుతారు. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల ఎలాంటి సంక్షోభాలనైనా అధిగమించొచ్చని, మన ధైర్యం, బలం పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు.
అంతేకాదు మన శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు హనుమాన్ చాలీసాలో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. అందులో కొన్ని ముఖ్యమైన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
మానసిక ప్రశాంతత..

హనుమాన్ చాలీసా పఠించే వ్యక్తి అన్ని రోగాల నుంచి విముక్తి పొందుతాడు. దీంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది. అంతేకాదు మానసిక సమస్య, ఆరోగ్య సమస్యల గురించి ఉపశమనం లభిస్తుంది. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించాలి.​

Hanuman Jayanti 2024 ఈసారి హనుమాన్ జయంతి ఎప్పుడొచ్చింది.. పూజా విధానం, శుభ ముహుర్తం, పఠించాల్సిన మంత్రాలివే..!


హనుమంతుడి గురించి..

హనుమాన్ చాలీసాలో 40 శ్లోకాలు ఉంటాయి. ఇవన్నీ హనుమంతుడి గురించి, ఆంజనేయుని శక్తిని కీర్తిస్తూ ఉండేవి. విశ్వానికి వాయుపుత్రుడు చేసిన సేవల గురించి తెలియజేస్తుంది. హనుమాన్ చాలీసాలోని 40 శ్లోకాలు అత్యంత శక్తివంతమైనవని పురాణాల్లో పేర్కొనబడింది. ఈ పంక్తులన్నీ ఆంజనేయ స్వామి గురించి తెలియజేస్తాయి.


హనుమాన్ చాలీసా రచయిత ఎవరంటే..

హనుమాన్ చాలీసా రాసిన వారిలో తులసీదాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఈయనే హనుమాన్ చాలీసా రచయితగా ప్రసిద్ధి చెందారు. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల ఆంజనేయుడి అనుగ్రహం కలుగుతుందని, తనే హనుమాన్ చాలీసా చివరి శ్లోకంలో వివరించారు.


రామయ్యకు సాయం..

హనుమాన్ చాలీసాలో మొదట్లో 43 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో రెండు ద్విపదలు, 40 చతుర్భుజాలు ఉంటాయి.

చివర్లో మళ్లీ రెండు ద్విపదలు ఉంటాయి. హనుమాన్ చాలీసాలోని 11 నుంచి 20 అధ్యాయులు రాముడికి వాయుపుత్రుడు చేసిన సేవలను వివరిస్తాయి. సాగరాన్ని దాటేందుకు రామయ్యకు సాయం చేస్తూ, హనుమంతుడు ఎంతో సహాయం చేశాడు. సీతమ్మను చూసేందుకు రామయ్యకు సహకరించిన విషయాలన్నీ ఇందులో ప్రస్తావించబడ్డాయి.


పాజిటివ్ ఎనర్జీ..

హనుమాన్ చాలీసాను క్రమం తప్పకుండా జపించడం వల్ల ఒక వ్యక్తి అనేక వ్యాధుల నుంచి విముక్తి పొందడమే కాదు, మీకు ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి..

పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఒక వ్యక్తి తన జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా వాటి నుంచి బయటపడతారు.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

Read Latest Religion News and Telugu News

READ ON APP