Hero Image

Hanuman Jayanti 2024 హనుమాన్ జయంతి వేళ మీ రాశి ప్రకారం, ఈ మంత్రాలను పఠిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయట..!

Hanuman Jayanti 2024 హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి ఏడాది ఛైత్ర శుద్ధ పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 23 తేదీన మంగళవారం నాడు హనుమాన్ జయంతి వచ్చింది. హిందూ పురాణాల ప్రకారం, ఆంజనేయుడు జన్మించిన రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు.
మరికొన్ని ప్రాంతాల్లో వైశాఖ దశమి తిథి రోజున జరుపుకుంటారు. కేరళ వంటి రాష్ట్రంలో మార్గశిర మాసంలో హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా హిందూ మత విశ్వాసాల ప్రకారం మంగళవారం హనుమంతుడికి అంకితం చేయబడింది. జ్యోతిష్యం ప్రకారం, హనుమంతుడి ఆశీస్సులు కావాలనుకునే వారు హనుమాన్ జయంతి రోజున ఈ మంత్రాలను పఠించడం వల్ల తమ జీవితంలోని సమస్యల నుంచి ఉపశమనం పొందడంతో పాటు, సకల పాపాల నుంచి విముక్తి పొందుతారని చాలా మంది నమ్ముతారు. ఈ సందర్భంగా 12 రాశుల వారు ఏయే మంత్రాలను పఠించాలో ఇప్పుడే చూసెయ్యండి...

మేష రాశి(Aries)..

ఈ రాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి హనుమాన్ జయంతి రోజున మేష రాశి వారు ‘ఓం అంగారకాయ నమః’ ‘ఓం సర్వ దుఃఖ హరాయ నమః’ అనే మంత్రాలను పఠించాలి. ఈ మంత్రాలను పఠించడం వల్ల శుభ ఫలితాలొస్తాయని చాలా మంది నమ్ముతారు.​Hanuman Jayanti 2024 ఈసారి హనుమాన్ జయంతి ఎప్పుడొచ్చింది.. పూజా విధానం, శుభ ముహుర్తం, పఠించాల్సిన మంత్రాలివే..!


వృషభ రాశి (Taurus)..

ఈ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. హనుమాన్ జయంతి రోజున ‘ఓం హన్ హనుమతే నమః’ ‘ఓం సర్వ దుఃఖ హరాయ నమః’ అనే మంత్రాలను పఠించడం వల్ల చాలా రంగాల్లో అద్భుత విజయాలు సాధించే అవకాశాలను పొందుతారు.


మిధున రాశి(Gemini)..

ఈ రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. హనుమాన్ జయంతి రోజున అతులిత్బల్ధం హేమశైలభదేహం దనుజవంకృషణుం జ్ఞానినామగ్రగణ్యమ్ సకలగుణిధాన్ వన్రానామధీశం రఘుపతిప్రియభక్త్ వాతజాత నమామి, ‘ఓం సర్వ దుఃఖ హరాయ నమః’ అనే మంత్రాలను పఠించాలి.


కర్కాటక రాశి(Cancer)..

ఈ రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు. హనుమాన్ జయంతి రోజున కర్కాటక రాశి వారు ‘ఓం అంజనీసుతాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో మారుతీ ప్రచోదయాత్ హై’ ‘ఓం పరాశౌర్య వినాశన నమః’ అనే మంత్రాలను పఠించాలి.


సింహ రాశి(Leo)..

ఈ రాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. అందుకే హనుమాన్ జయంతి రోజున సింహ రాశి వారు ‘ఓం హనుమతే రుద్రాత్మకాయ హుమ్ ఫట్’ ‘ఓం పరాశౌర్య వినాశన నమః’ అనే మంత్రాలను పఠించాలి.


కన్య రాశి (Virgo)..

ఈ రాశి వారికి కూడా బుధుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి హనుమాన్ జయంతి రోజున ‘‘అతులిత్బల్ధం హేమశైలభదేహం దనుజవంకృషణుం జ్ఞానినామగ్రగణ్యమ్ సకలగుణిధాన్ వన్రానామధీశం రఘుపతిప్రియభక్త్ వాతజాత నమామి’’ ‘ఓం పరాశౌర్య వినాశన నమః’ అనే మంత్రాన్ని పఠించాలి.

ఆంజనేయుడు లేని ఆ కోదండ రామాలయంలో ఇప్పటికీ వీడని మిస్టరీలెన్నో...!
తులా రాశి (Libra)..

ఈ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. అందుకే హనుమాన్ జయంతి రోజున ‘ఓం హన్ హనుమతే నమః’ ‘ఓం మనోజవాయ నమః’ ఓం లక్ష్మణప్రాణదాత్రే నమః’ అనే మంత్రాలను జపించాలి.


వృశ్చిక రాశి(Scorpio)..

ఈ రాశి వారికి అంగారకుడు(కుజుడు) అధిపతిగా ఉంటాడు. అందుకే హనుమాన్ జయంతి రోజున ‘ఓం అంగారకాయ నమ’ ‘ఓం మనోజవాయ నమః’ ‘ఓం లక్ష్మణప్రాణదాత్రే నమః’ అనే మంత్రాలను జపించాలి.


ధనస్సు రాశి (Sagittarius)..

ఈ రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు. అందుకే హనుమాన్ జయంతి రోజున ధనస్సు రాశి వారు ‘ఓం హన్ హనుమతే నమః’ ‘ఓం మనోజవాయ నమః’ ‘ఓం లక్ష్మణప్రాణదాత్రే నమః’ అనే మంత్రాన్ని పఠించాలి.


మకర రాశి (Capricorn)..

ఈ రాశి వారికి శని దేవుడు అధిపతిగా ఉంటాడు. హనుమాన్ జయంతి రోజున శని ప్రభావం నుంచి విముక్తి పొందేందుకు ‘ఓం నమో హనుమతే రుద్రావతారాయ సర్వశత్రుసహరణాయ హరాయ సర్వవశికరణాయ రామదూతాయ స్వాహా’ ‘ఓం సర్వగ్రహ వినాశి నమః’ అనే మంత్రాలను జపించాలి.

READ ON APP