Hero Image

Meta AI : వాట్సాప్, ఇన్స్టా యూజర్ల కోసం మరో కొత్త ఫీచర్.. ఏం అడిగినా క్షణాల్లో రిప్లయ్!

Meta AI Assistant : నేడు అంతా టెక్నాలజీ మయం. ఇంకా చెప్పాలంటే అంతా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మయం. ఈ క్రమంలో.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బోట్ బాటలో ఫేస్ బుక్ పేరెంట్ సంస్థ మెటా (Meta) అడుగు పెట్టింది. వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, మెసెంజర్ యాప్ల్లో సరికొత్త ఏఐని ఇంటిగ్రేట్‌ చేసింది.
గతేడాది సెప్టెంబర్‌లోనే మెటా ఏఐ అసిస్టెంట్ సేవలు ప్రారంభమైనా.. తాజాగా మెటా తన ఏఐ అసిస్టెంట్ (Meta AI Assistant)ను వాట్సాప్, ఫేస్‌బుక్, మెసేంజర్, ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్స్‌లో ఇంటిగ్రేట్‌ చేసింది. లాలామా 3 లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఆధారంగా మెటా ఏఐ చాట్‌బోట్ పని చేస్తుంది. ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీ తరహాలో మెటా ఏఐ చాట్‌బోట్.. యూజర్లు అడిగే ఏ ప్రశ్నకైనా జవాబు అందిస్తుంది. అంతేకాకుండా.. వాట్సప్‌లో రియల్‌టైమ్‌ ఇమేజ్లను, యానిమేషన్స్ను రూపొందించి ఇస్తుంది.
ప్రస్తుతానికి ఇది కొంత మంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో టెక్ట్స్ అప్ లోడ్ చేస్తే తేలిగ్గా ఇమేజ్ జనరేట్ అవుతుంది. నాణ్యత తగ్గకుండానే ఫోటోలు యానిమేట్ చేయొచ్చు. meta.ai సాయంతో వెబ్‌లోనూ ఈ సేవలు సద్వినియోగం చేసుకోవచ్చు. అత్యంత తెలివి గల AI అసిస్టెంట్ ను ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా వినియోగించుకోవాలి అని మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ సూచించారు. యూజర్లు ఊహించుకున్న చిత్రానికి అనుగుణంగా టెక్ట్స్ పంపితే మెటా ఏఐ అసిస్టెంట్ ఇమేజ్ తయారుచేస్తుంది.
అంతే కాదు GIF మార్చే ఫీచర్ కూడా ఉందని మెటా తెలిపింది. అంతేకాదు ఇది ప్రాంప్ట్‌లు, సూచనలను కూడా అందిస్తుందని మెటా (Meta) చెబుతోంది.మెటా ఏఐని పలు దేశాలకు విస్తరిస్తామని మెటా వెల్లడించింది. భారత్ లోనూ కొందరు యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్ చాట్ మెనూలో వివిధ రంగులతో కూడిన వృత్తాకారంలో ఉండే మెటా ఏఐ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ‘ఆస్క్ మెటా ఏఐ ఎనీథింగ్’ అంటు ఒక పాప్ అప్ ఓపెన్ అవుతుంది. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మెటా ఏఐతోపాటు ఓపెన్ అయ్యే చాట్‌మెనూలో చాట్ జీపీటీ తరహాలోనే యూజర్ల ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది.

READ ON APP