Hero Image

'సర్కార్' టీజర్: కార్పోరేట్ క్రిమినల్ విజయ్

విజయదశమి కానుకగా ‘సర్కార్’ టీజర్‌తో అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు ఇళయదళపతి విజయ్. మురుగదాస్, విజయ్ కాంబినేషన్‌లో భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ‘సర్కార్’ టీజర్‌ను కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది చిత్ర యూనిట్.

తుపాకి, కత్తి వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తరువాత విజయ్, మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో మూవీ కావడంతో ఈ చిత్రంపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి.

ఈ అంచనాలకు తగ్గట్టే ‘సర్కార్’ టీజర్‌ రూపొందించాడు దర్శకుడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీలో స్టైలిష్ పెర్ఫామెన్స్‌తో అదరగొడుతున్నాడు విజయ్.

కీర్తి సురేష్ కథానాయికగా నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్ ప్రతినాయిక పాత్రలో కనిపిస్తున్నారు. ఏ ఆర్ రహమాన్ సంగీతం అందించగా.. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిచింది. దీపావళి కానుకగా నవంబర్ 6న భారీ స్థాయిలో విడుదలకానుంది సర్కార్.


READ ON APP